సిప్‌ ప్రారంభానికి సరైన సమయమేది? | Sakshi
Sakshi News home page

సిప్‌ ప్రారంభానికి సరైన సమయమేది?

Published Mon, Oct 16 2017 12:51 AM

What's the right time for sip start?

నేను మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త. నేను ఎంత రిస్క్‌ను అయినా భరించగలను. 10–15 ఏళ్ల కాలానికి గాను నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి.   –రాంబాబు, విజయవాడ 

మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కొత్త. మీరు ఎంత రిస్క్‌ను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మీరు ఇన్వెస్ట్‌ చేసిన వెంటనే మార్కెట్‌ పతనమైతే, మీకు మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పట్ల ఉత్సాహం తగ్గిపోతుంది. అందుకని ఎంత రిస్క్‌ భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో మొదటగా ఇన్వెస్ట్‌ చేసేవారికి బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ను సూచిస్తాం. మొదటి 2–3 ఏళ్ల కాలానికి మీరు మంచి బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.

సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన వచ్చిన తర్వాత, ఒకటి లేదా రెండు ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో  ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమైన పెట్టుబడి వ్యూహం. పిల్లల ఉన్నత చదువులు, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది. మీకు పన్ను ప్రయోజనాలు కావాలనుకుంటే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ కంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌(ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌)లో ఇన్వెస్ట్‌ చేయండి.  

నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయాలనేది నా ఆలోచన. అయితే ఇప్పుడు మార్కెట్‌ రికార్డ్‌ స్థాయిలో ఉంది. మార్కెట్‌ పడిపోయినప్పుడు సిప్‌లు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?
–సంతోష్, కరీంనగర్‌

సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) పరమార్థం... ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెట్టడం. సిప్‌ ప్రారంభానికి మార్కెట్‌ పతనం దాకా వేచి చూడడం సరైన పనికాదు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు  మార్కెట్‌ పతనమయ్యేదాకా వేచి చూడడంలో ఒకింత అర్థం ఉంది. కానీ ఇది కూడా సరైన మదుపు వ్యూహం కాదు. ఎందుకంటే మార్కెట్‌ను సమర్థవంతంగా అర్థం చేసుకోవడం చాలా మంది ఇన్వెస్టర్ల వల్ల కాదు.

సిప్‌ ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడంటే.., మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే. చాలా మంది ఇన్వెస్టర్లు గత రెండేళ్లుగా కరెక్షన్‌ వస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉన్నారు. కరెక్షన్‌ కోసం వేచి చూస్తూ, పలువురు ఇన్వెస్టర్లు చాలా మంచి అవకాశాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు కరెక్షన్‌ వస్తే రావచ్చు. మార్కెట్‌ నిలకడగా పెరుగుతోంది.

కానీ ఫండమెంటల్స్‌ ఏమంత ప్రోత్సాహకరంగా లేవు. మార్కెట్‌ రికార్డ్‌ స్థాయిల్లో ఉన్నప్పటికీ, మీరు సిప్‌ను ప్రారంభించవచ్చు. మార్కెట్‌ పతనమయ్యేదాకా వేచిచూడడం కంటే ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు కొనసాగించడం సరైన పెట్టుబడి విధానం. సిప్‌ వల్ల అది సాకారమవుతుంది.  

నేను మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసినప్పటి ఎక్స్‌పెన్స్‌ రేషియోనే.. ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసినంత కాలమూ ఉంటుందా ? ఆ ఫండ్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిన కాలంలో ఎక్స్‌పెన్స్‌ రేషియోలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయా ? ఎక్స్‌పెన్స్‌  రేషియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఎన్‌ఏవీని ప్రకటిస్తారా ?   –రేణుక, హైదరాబాద్‌

మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణకు అయిన ఖర్చులను ఎక్స్‌పెన్స్‌ రేషియోగా వ్యవహరిస్తారు. మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, కస్టోడియన్‌ తదితర చార్జీలన్నీ దీంట్లో కలసి ఉంటాయి. ఎక్స్‌పెన్స్‌ రేషియో మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినంత కాలమూ ఉంటుంది. ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగినంత కాలం ఒకే ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉండాలని లేదు. ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియోలో మార్పులు, చేర్పులు ఉండొచ్చు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంత ఎక్స్‌పెన్స్‌ రేషియోను వసూలు చేయాలన్నది మార్కెట్‌ నియంత్రణ సంస్థ, (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) నిర్దేశిస్తుంది. ఎక్స్‌పెన్స్‌ రేషియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఎన్‌ఏవీని నిర్ణయిస్తారు. మీ ఫండ్‌ నుంచి వ్యయాలను తీసివేసి ఎన్‌ఏవీని లెక్కిస్తారు. మీరు ఇన్వెస్ట్‌ చేసిన  ఫండ్‌ ఎన్‌ఏవీ ఎంత ఉందో  అదే మీ ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ.  

దీపావళి పండుగ సందర్భంగా నాకు రూ. 4 లక్షల వరకూ బోనస్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఈ మొత్తాన్ని ఏదైనా లిక్విడ్‌ ఫండ్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మంచి లిక్విడ్‌ ఫండ్‌ను సూచించండి.   –శ్రీకాంత్, బెంగళూరు

లిక్విడ్‌ ఫండ్స్‌ పనితీరులో పెద్దగా తేడాలుండవు. దాదాపు అన్ని లిక్విడ్‌ ఫండ్స్‌ ఒకే మాదిరి పనితీరు కనబరుస్తాయి. స్వల్పకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే, సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా కంటే కూడా లిక్విడ్‌ ఫండ్స్‌ ఒకింత అధిక రాబడిని ఇస్తాయి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ డబ్బులను రిడీమ్‌ చేసుకునే వెసులుబాటు ఉన్న మొబైల్‌ యాప్‌ ఉన్న లిక్విడ్‌ ఫండ్‌కే ప్రాధాన్యత ఇవ్వండి.

దీర్ఘకాలం పాటు మీకు ఈ డబ్బులు అవసరం లేకపోతే, ఇతర పెట్టుబడి మార్గాలను పరిశీలించవచ్చు. ఇక మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ లిక్విడ్‌ ఫండ్స్‌లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఎస్కార్ట్స్‌ లిక్విడ్‌ ప్లాన్, ఇండియాబుల్స్‌ లిక్విడ్‌ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్‌–షార్ట్‌ టర్మ్‌ ప్లాన్, యాక్సిస్‌ లిక్విడ్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా ట్రెజరీ మేనేజ్‌మెంట్‌ అకౌంట్‌ ఫండ్, కోటక్‌ ఫ్లోటర్‌  షార్ట్‌ టర్మ్‌–రెగ్యులర్‌ ప్లాన్‌.  


– ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement