రియల్‌మి ఎక్స్..రెడ్‌మి కె20 కు షాకిస్తుందా?

Realme X will launch on July15 Flipkart availability teased - Sakshi

జూలై 15న రియల్‌మి ఎక్స్‌ లాంచ్‌

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయం

సాక్షి, ముంబై : ఒప్పో చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను  ఆవిష్కరించనుంది.  ఈ నెల 15వ తేదీన రియల్‌మి ఎక్స్‌ పేరుతో   ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను  భారత మార్కెట్‌లో లాంచ్‌  చేయనుంది.  ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. చైనాలో లాంచ్‌ చేసిన రియల్‌మి ఎక్స్‌ కంటే  భిన్నంగా భారత్‌లో  ఈ  స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నామని రియల్‌మీ సీఈవో మాధవ్‌ సేత ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. పాప్‌ అప్‌ కెమెరా, వూక్‌ ప్లాష్‌ చార్జ్‌  3.0, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లతో 4జీబీ, 6 జీబీ ర్యామ్ ‌/ 64 జీబీ స్టోరేజ్‌ , 8జీబీ ర్యామ్‌ /128జీబీ స్టోరేజ్‌  మూడు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది.  ప్రీమియం వెర్షన్‌ ధరను రూ.18,000గా నిర్ణయించే అవకాశం ఉందని అంచనా.

రియల్‌మి ఎక్స్ ఫీచర్లు
6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
 ఆండ్రాయిడ్ 9.0 పై
 ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,
48 + 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3765 ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top