మహిళల రక్షణకు ఎయిర్‌టెల్, ఎఫ్‌ఎల్‌వోల నుంచి యాప్‌ | New App For Ladies Safety From Bharathi Airtel And FLO | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణకు ఎయిర్‌టెల్, ఎఫ్‌ఎల్‌వోల నుంచి యాప్‌

Apr 15 2019 7:29 AM | Updated on Apr 15 2019 7:29 AM

New App For Ladies Safety From Bharathi Airtel And FLO  - Sakshi

న్యూఢిల్లీ: మై సర్కిల్‌ పేరుతో మహిళలకు అత్యవసర సందర్భాలు, ఒత్తిడి సమయంలో ఉపకరించే యాప్‌ను భారతీ ఎయిర్‌టెల్, ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) విడుదల చేశాయి. కేవలం ఎయిర్‌టెల్‌ యూజర్లనే కాకుండా ఇతర టెలికం యూజర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌ సాయంతో తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లి ష్, హిందీ సహా 13 భాషల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఐదుగురికి ఎస్‌ఓఎస్‌ అలర్ట్స్‌ను పంపించొచ్చని విడుదలైన ప్రకటన తెలిపింది. తద్వారా తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమను చేరుకోవాలని సందేశాన్ని పంపొచ్చని పేర్కొంది. గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ ఐవోఎస్‌ స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement