మార్చి 3 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ పోర్టబిలిటీ | Nationwide Mobile Number Portability From March 3rd | Sakshi
Sakshi News home page

మార్చి 3 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ పోర్టబిలిటీ

Feb 26 2015 2:51 AM | Updated on Sep 2 2017 9:54 PM

మార్చి 3 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ పోర్టబిలిటీ

మార్చి 3 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ పోర్టబిలిటీ

దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) వచ్చే నెల 3 నుంచి అమల్లోకి వస్తోంది.

ఎంఎన్‌పీ చట్టానికి సవరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) వచ్చే నెల 3 నుంచి అమల్లోకి వస్తోంది. ఈ మేరకు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) 2009 నాటి ఎంఎన్‌పీ నిబంధనలను సవరించింది. ఈ చట్టానికి చేసిన ఆరో సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి ఎంఎన్‌పీ అందుబాటులోకి వస్తుందని ట్రాయ్ పేర్కొంది. వినియోగదారుడు తన ఫోన్ నంబర్‌ను మార్చుకోకుండానే టెలికం సర్వీసులందజేసే ఆపరేటర్‌ను మార్చుకోవడానిన ఎంఎన్‌పీగా వ్యవహరిస్తారు. ఇప్పటివరకూ ఈ ఎంఎన్‌పీ ఒక టెలికం సర్కిల్(సాధారణంగా ఒక రాష్ట్రానికి)కు మాత్రమే పరిమితమై ఉంది.

ఇక వచ్చే నెల 3 నుంచి ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అంటే హైదరాబాద్‌లో ఉన్న వినియోగదారుడు ఢిల్లీకి మారితే, అక్కడ ఆ యూజర్ ఎంఎన్‌పీని పొందొచ్చు. కాగా ఎంఎన్‌పీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మొబైల్ సర్వీసులందజేసే కంపెనీలపై రూ.9.4 కోట్ల జరిమానాలు విధించామని టెలికం మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా వినియోగదారుడి ఎంఎన్‌పీని పూర్తి చేయలేని పక్షంలో రూ.5,000కు మించకుండా ట్రాయ్ జరిమానా విధించవచ్చన్నారు.  ఎంఎన్‌పీ విజ్నప్తిని అన్యాయంగా తిరస్కరిస్తే రూ.10,000కు మించకుండా జరిమానా విధించవచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement