ల్యాంకో ఇన్‌ఫ్రాకు భారీ నష్టం | Lanco Infratech Q4 loss widens to Rs 584 cr income down 23% | Sakshi
Sakshi News home page

ల్యాంకో ఇన్‌ఫ్రాకు భారీ నష్టం

May 26 2014 1:37 AM | Updated on Sep 4 2018 5:07 PM

ల్యాంకో ఇన్‌ఫ్రాకు భారీ నష్టం - Sakshi

ల్యాంకో ఇన్‌ఫ్రాకు భారీ నష్టం

నాల్గవ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ భారీనష్టాలను మూటగట్టుకుంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర నష్టం రూ.31.6 కోట్ల నుంచి రూ.584 కోట్లకు ఎగబాకింది. ఆదాయం రూ.3,708 కోట్ల నుంచి రూ.2,827 కోట్లకు తగ్గింది.

2013-14 సంవత్సరానికిగాను రూ.2,274 కోట్ల నికర నష్టం చవిచూసింది. క్రితం సంవత్సరంలో నష్టం రూ.1,073 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.15,147 కోట్ల నుంచి రూ.10,707 కోట్లకు పడింది. గ్రిఫిన్ కోల్ మైన్ ఆదాయం 65 శాతం తగ్గి రూ.411 కోట్ల నుంచి రూ.145 కోట్లకు చేరింది. విద్యుత్, ఈపీసీ విభాగం పనితీరు ఆశాజనకంగా లేకపోవడంతో నష్టాలను చవిచూసింది. ప్రాజెక్టుల అమలు ఆలస్యం కావడం, వ్యయం, ధరలు పెరగడం ఈ పరిస్థితికి కారణమని కంపెనీ తెలిపింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement