హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ రేటు కోత | HDFC Bank cuts lending rate | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ రేటు కోత

Jun 18 2015 1:00 AM | Updated on Jul 11 2019 5:24 PM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ రేటు కోత - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ రేటు కోత

ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కనీస (బేస్) రుణ రేటును 0.15 శాతం తగ్గించింది.

న్యూఢిల్లీ : ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కనీస (బేస్) రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.70 శాతానికి చేరింది. జూన్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. కనీస రుణ రేటు తగ్గడం వల్ల దీనితో అనుసంధానమైన వాహన, గృహ, విద్యా రుణ రేట్లు తగ్గే వీలుంటుంది. ఇంతక్రితం ఏప్రిల్ 13న బ్యాంక్ రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.85 శాతానికి చేరింది. తాజా నిర్ణయంతో ఈ రేటు మరో 15 బేసిస్ పాయింట్లు తగ్గినట్లయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2న రెపో రేటును పావుశాతం తగ్గించింది. ఈ ఏడాది మొత్తంలో 0.75 శాతం తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనంలో కొంత కస్టమర్లకు బదలాయిస్తున్నాయి.

 ఎస్‌బీబీజే కూడా...
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే) కూడా బేస్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 10.10% నుంచి 9.95 శాతానికి తగ్గింది. ఈ రేటు జూన్ 18 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ బీఎస్‌ఈకి పంపిన ఒక ఫైలింగ్‌లో తెలిపింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement