ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష. | Government to review life cover scheme under Jan Dhan after 5 years | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష.

Feb 2 2015 3:14 AM | Updated on Sep 2 2017 8:38 PM

ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష.

ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష.

ప్రధాన మంత్రి జనధన యోజన(పీఎంజేడీవై) కింద ఖాతాలు ప్రారంభించిన వారికి ఇచ్చే జీవిత బీమా(లైఫ్ కవర్) స్కీమ్‌ను ఐదేళ్ల తర్వాత సమీక్షిస్తామని ఆర్థిక శాఖ వెల్లడించింది.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జనధన యోజన(పీఎంజేడీవై) కింద ఖాతాలు ప్రారంభించిన వారికి ఇచ్చే జీవిత బీమా (లైఫ్ కవర్) స్కీమ్‌ను ఐదేళ్ల తర్వాత సమీక్షిస్తామని ఆర్థిక  శాఖ వెల్లడించింది.  జనధన ఖాతాదారులకు రూ.30,000 జీవిత బీమా కవరేజీ 2019-20 ఆర్థిక సంవత్సరం వరకూ వర్తిస్తుందని, ఆ తర్వాత ఈ స్కీమ్ కొనసాగింపు, ప్రీమియం చెల్లింపులు, తదితర అంశాలను తగినవిధంగా సమీక్షిస్తామని పేర్కొంది.

గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది జనవరి 26 మధ్య తొలిసారిగా బ్యాంకు ఖాతాలు తెరచిన వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రభుత్వోద్యోగులు(రిటైరైన వాళ్లు కూడా), వారి కుటుంబాలు, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవాళ్లు, టీడీఎస్ చెల్లించేవాళ్లు, ఆమ్ ఆద్మీ బీమా యోజన వర్తించేవాళ్లు, తదితరులకు ఈ లైఫ్ కవర్ స్కీమ్ వర్తించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement