ఫ‍్లిప్‌కార్ట్‌ ఉమెన్స్‌ డే సేల్‌ : రూ.6వేల తగ్గింపు | Flipkart International Women Day Sale | Sakshi
Sakshi News home page

ఫ‍్లిప్‌కార్ట్‌ ఉమెన్స్‌ డే సేల్‌ : రూ. 6వేల తగ్గింపు

Mar 7 2019 5:27 PM | Updated on Mar 3 2020 7:07 PM

Flipkart International Women Day Sale - Sakshi

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఉమెన్స్‌ డే సేల్‌   పేరుతో ఈ నెల 7, 8 తేదీల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు  అందిస్తోంది. 

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8, నోకియా 6.1 ప్లస్‌, హానర్‌ 9ఎన్, హానర్‌ 9లైట్‌, హానర్‌ 7ఏ, మోటో వన్‌ పవర్‌, వివో వి9 ప్రో లాంటి  మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్‌  చేస్తోంది. వీటితోపాటు లాప్‌టాప్స్‌, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, కెమెరాలు, పవర్ బ్యాంక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను అందించనుంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ల ద్వారా నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తోంది.

హానర్‌  మొబైల్స్‌ భారీ డిస్కౌంట్లు
హానర్‌ 7ఏ ( 3జీబీ, 32జీబీ స్టోరేజ్‌ రూ.7999
హానర్‌ 9 లైట్‌( 3జీబీ, 32జీబీ స్టోరేజ్‌) రూ.7999, తగ్గింపు రూ.6వేలు
హానర్‌ 9ఎన్‌ (3జీబీ, 32జీబీ స్టోరేజ్‌) (విత్‌ నాచ్‌డిస్‌ప్లే)  రూ.8999, తగ్గింపు రూ.5వేలు
హానర్‌ 9ఎన్‌ (4జీబీ, 64జీబీ స్టోరేజ్‌) రూ. రూ.9,999  తగ్గింపు

గూగుల్‌ పిక్సెల్‌ 3 రూ. 71,000గా ఉండగా.. 64జీబీతో రూ.59,999 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 రూ.30,990కే  లభిస్తోంది అసలు ధర 34,990. నోకియా 6.1 ప్లస్‌ రూ.13,999 అసలు ధర రూ.15,499 ఉండగా.. రేపటి నుంచి  అందుబాటులోకి రానుంది. 

వివో వి9 ప్రోపై రూ.2000 డిస్కౌంట్‌తో రూ. 13,990కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా వివో వి9 ప్రోపై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కింద మరో రూ.1500 డిస్కౌంట్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. జెన్‌ఫోన్ లైట్‌ ఎల్1 అత్యధికంగా రూ. 4,999 డిస్కౌంట్‌పై లభించనుంది.

హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌లాంటి మొబైల్‌ యాక్ససరీస్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్‌. అలాగే ల్యాప్‌టాప్స్‌ను తక్కువ ధరకే అందుబాటులో ఉంచింది. కాగా ఈ ఆఫర్లు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండనున్నాయి. రెండు రోజుల్లో ప్రతిగంటకు ఒకసారి ఆఫర్లు మారుతుంటాయి. పూర్తి వివరాలు ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో లభ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement