ఉల్లి కిలో రూ.8 : కన్నీరు మున్నీరవుతున్న రైతు 

Crying Farmer Forced To Sell Onions At Rs 8 Per Kg In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: ఒకవైపు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు వినియోగదారుల కంట  కన్నీరు పెట్టిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ఉల్లి రైతులు  పండించిన పంటకు కనీస  విలువ లభించక లబోదిబో మంటున్నారు. ఆరుగాలం శ్రమించిన పండించిన  పంటకు సరియైన ధర లభించక కన్నీరు మున్నీరవుతున్నాడు.  దేశవ్యాప్తంగా కిలో ఉల్లి దర  సుమారు రూ.100 పలుకుతోంటే..అహ‍్మద్‌ నగర్‌కు చెందిన  రైతుకు లభించింది మాత్రం రూ. 8. దీంతో  రైతులు తీరని సంక్షోభంలో కూరుకుపోయిన రైతు పొలం నుంచి ఉల్లిపాయను తీసిన కార్మికులకు ఏమి చెల్లించాలి, కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలి? అని బిడ్డల్ని ఎలా పోషించాలంటూ కన్నీరు పెడుతున్న వైనం పలువుర్ని కదిలిస్తోంది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.  సీఎం పదవి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు.  రైతుల  పరిస్థితి వారికి పట్టదని  ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.   

అటు విపరీతంగా పెరిగిన ఉల్లి ధరను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది. ఒక లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయిచింది. దిగుమతి చేసుకున్న ఉల్లిని నవంబర్ 15- డిసెంబర్ 15 మధ్యకాలంలో దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి ఎంఎంటీసీని కోరామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇటీవల ప్రకటించారు.

కాగా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర పౌరులు తమ తీర్పునిచ్చి పద్దెనిమిది రోజులు గడిచాయి. కానీ బీజేపీ-శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం ఎవర్ని వరించబోతోందన్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. దీంతో రాష్ట్ర రాజకీయం  వాడి వేడిగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్‌తో భారీ మంతనాలు సాగించి చివరకు ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధ మవుతుండటంతో, మహారాష్ట రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేచినట్టే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top