
గుర్‌గావ్: ఫారెన్ ఎక్స్‌చేంజ్, రెమిటెన్స్‌ల మార్కెట్‌ప్లేస్ బుక్‌మైఫారెక్స్.కామ్ తాజాగా యస్ బ్యాంక్‌తో జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి వీసా నెట్‌వర్క్‌పై మల్టీ కరెన్సీ ఫారెక్స్ ట్రావెల్ కార్డ్‌ను ప్రవేశపెట్టాయి. బుక్‌మైఫారెక్స్ పోర్టల్‌లో కస్టమర్లు ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఇంటర్–బ్యాంక్ రేట్స్ మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌కు అనువుగా కార్డును రూపొందించామని బుక్‌మైఫారెక్స్ ఫౌండర్ సుదర్శన్ మోత్వానీ తెలిపారు.