జియో రూ.98 ప్యాక్‌కు పోటీగా.... | To Beat Jio Rs. 98 Pack, Airtel Updates Rs. 93 Recharge to Offer 28-Day Validity | Sakshi
Sakshi News home page

జియో రూ.98 ప్యాక్‌కు పోటీగా....

Feb 12 2018 2:08 PM | Updated on Feb 12 2018 2:08 PM

To Beat Jio Rs. 98 Pack, Airtel Updates Rs. 93 Recharge to Offer 28-Day Validity - Sakshi

ఎయిర్‌టెల్‌ రూ.93 ప్యాక్‌ అప్‌డేట్‌ (ఫైల్‌ ఫోటో)

జియోకు పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ కూడా తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రిపబ్లిక్‌ డే ఆఫర్‌లో భాగంగా జియో రూ.98 ప్యాక్‌ను తీసుకొస్తే... దానికి పోటీగా ఎయిర్‌టెల్‌ తన రూ.93 రీఛార్జ్‌ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేసింది. 10 రోజుల వాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌... ఇక నుంచి నెల పాటు అందించనున్నట్టు పేర్కొంది. వాయిస్‌ కాలింగ్‌ బెనిఫిట్స్‌ కస్టమర్లను టార్గెట్‌గా చేసుకుని జియో, ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చాయి. 

ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం అప్‌డేట్‌ చేసిన ఈ ప్యాక్‌పై అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను, రోమింగ్‌పై ఉచిత కాల్స్‌ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను, 1జీబీ 4జీ లేదా 3జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది.. ఒక్కసారి రోజువారీ, వారం వారీ పరిమితులు మించి పోయాక, కస్టమర్లకు నిమిషానికి 10 పైసలు ఛార్జ్‌ చేయనున్నారు. జియో అందిస్తున్న ప్రయోజనాలకు సమానంగా తన కస్టమర్లకు అందించడానికి ఎయిర్‌టెల్‌ ఈ రూ.93 ప్యాక్‌ను అప్‌డేట్‌ చేసినట్టు తెలిసింది. జియో సైతం తన రూ.98 రీఛార్జ్‌ ప్యాక్‌పై అందించే డేటాను 1జీబీ నుంచి 2జీబీకి పెంచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement