గ్రహం అనుగ్రహం  (30-06-2020) | Daily Horoscope Telugu 30-06-2020 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం  (30-06-2020)

Jun 30 2020 7:02 AM | Updated on Jun 30 2020 7:04 AM

Daily Horoscope Telugu 30-06-2020 - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.దశమి రా.7.18 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం చిత్త ఉ.5.48 వరకు
తదుపరి స్వాతి తె.4.09 వరకు (తెల్లవారితే బుధవారం) వర్జ్యం ప.11.01 నుంచి 12.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.05 నుంచి 8.57 వరకు తదుపరి ప.10.55 నుంచి 11.38 వరకు అమృతఘడియలు...రా.7.54 నుంచి 9.22 వరకు 
రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం 5.32
సూర్యాస్తమయం 6.34


దినఫలాలు....(మంగళవారం, 30.06.20)
మేషం...
ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. నూతన వస్తులాభాలు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృషభం..
పరపతి పెరుగుతుంది.  ముఖ్య సమాచారం అందుతుంది. భూ వివాదాలు పరిష్కారం.పట్టుదలతో కార్యక్రమాలు  చక్కదిద్దుతారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు . పారిశ్రామికవేత్తలకు అనుకోని అవకాశాలు.

మిథునం...
ఆదాయం అంతగా కనిపించదు. అనుకోని ఖర్చులు.  ఆత్మీయులు, బంధువులతో విరోధాలు. దూరప్రయాణాలు ఉంటాయి.  వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగులకు మార్పులు. 

కర్కాటకం..
ప్రయాణాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.భూవివాదాలు నెలకొంటాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

సింహం...
విద్య,ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు.

కన్య..
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రాబడి తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారులు కొంత నిరాశ చెందుతారు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. 

తుల..
నూతన ఉద్యోగయోగం. కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు.  వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు పురస్కారాలు.

వృశ్చికం..
చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవం.

ధనుస్సు....
ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి కీలకమైన సమాచారం. రాబడిసంతృప్తికరంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలలో  పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం. 

మకరం..
కొత్త వ్యక్తుల పరిచయం. అందరిలోనూ గౌరవం. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. రాబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు లాభాలు.. ఉద్యోగులుు సమర్థతను నిరూపించుకుంటారు.

కుంభం...
శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి చేస్తారు. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. . కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు విధి నిర్వహణలో కొంత  గందరగోళం. .

మీనం..
అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బందులు. ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. శ్రమ పెరుగుతుంది.  వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఒడిదుడుకులు.. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement