నీళ్ల కోసం అల్లాడుతున్నాపట్టించుకోరా? | yv subbareddy fires on ap government | Sakshi
Sakshi News home page

నీళ్ల కోసం అల్లాడుతున్నాపట్టించుకోరా?

Mar 27 2015 8:24 PM | Updated on Aug 18 2018 5:57 PM

ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాలపై ఏపీ సర్కారు చిన్నచూపు చూస్తోందని వైఎస్ఆర్ సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాలపై ఏపీ సర్కారు చిన్నచూపు చూస్తోందని వైఎస్ఆర్ సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ మంచినీటి కోసం జనం అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రకాశం జిల్లాకు కల్పతరువు లాంటి వెలిగొండ ప్రాజెక్టు కు నిధులివ్వలేదని మండిపడ్డారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం రెండేళ్ల వ్యవధిలోనే పనులు పూర్తి చేయిస్తామన్నారు. త్వరలో కేంద్రమంత్రి నడ్డా జిల్లాలో పర్యటిస్తామని హామీ ఇచ్చినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement