అనంతపురం జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన ఇన్సూరెన్స్ రైతులకు అందటం లేదని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
హైదరాబాద్ : అనంతపురం జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన ఇన్సూరెన్స్ రైతులకు అందటం లేదని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆరు లక్షలమంది ఇన్సూరెన్స్ కడితే కేవలం 1.18లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చిందన్నారు. ఇన్సూరెన్స్ వారంలోగా అందుతుందని మంత్రులు చెప్పినా ఇప్పటివరకూ ఇన్సూరెన్స్ ఇవ్వలేదన్నారు.
జిల్లాకు కేటాయించిన రూ.643 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకూ అందలేదని వైవీ.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆందోళనలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, రుణ మాఫీ వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానమిచ్చారు. అనంతపురం జిల్లా రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.2265 కోట్లు జమచేసినట్లు చెప్పారు.