ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పిస్తారు. ఏపీ శాసన మండలిలో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రతిపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. నదుల అనుసంధానంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.