242వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan Prajasankalpayatra 242th Day Schedule Released - Sakshi

సాక్షి, పాయకరావుపేట: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 242వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం జననేత పాయకరావుపేట నియోజకవర్గం కైలాసపట్నం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి చౌడువాడ క్రాస్‌, గొట్టివాడ, పండూరు క్రాస్‌ మీదుగా రామచంద్రపురం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ లంచ్‌ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. దార్లపూడి జంక్షన్‌ మీదుగా దార్లపూడి వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

ముగిసిన పాదయాత్ర:  వైఎస్‌ జగన్‌ 241వ రోజు పాదయాత్ర సోమవారం పాయకరావుపేట నియోజకవర్గంలోని కైలాసపురం వద్ద ముగిసింది. నేడు జననేత యండ్లపల్లి, జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్‌, కోటవూరట్ల మీదుగా కైలాసపురం వరకు 12.8 కిలోమీటర్లు నడిచారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top