
సాక్షి, నర్సీపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 238వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం జననేత నాతవరం మండలం ఎర్రవారం జంక్షన్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎరకంపేట క్రాస్ రోడ్, ముల్గపుడి వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.