అంతా ఏపీ వైపు చూసేలా చేస్తాను: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Message To AP People | Sakshi
Sakshi News home page

అంతా ఏపీ వైపు చూసేలా చేస్తాను: వైఎస్‌ జగన్‌

May 31 2019 2:19 PM | Updated on May 31 2019 2:30 PM

YS Jagan Mohan Reddy Message To AP People - Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో శుక్రవారం ఆయన ఒక సందేశాన్ని ఉంచారు. ఈ విజయం తనపై పెద్ద బాధ్యతను ఉంచిందని పేర్కొన్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా మంచి పరిపాలన అందజేస్తానని పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151, 25 పార్లమెంట్‌ స్థానాలకు గాను 22 స్థానాలు సాధించి విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement