335వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan 335th Day PrajaSankalpaYatra Schedule Released | Sakshi
Sakshi News home page

Dec 31 2018 7:05 PM | Updated on Dec 31 2018 7:10 PM

YS Jagan 335th Day PrajaSankalpaYatra Schedule Released - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 335వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వంకులూరు క్రాస్‌ నుంచి జననేత పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చిన్న వంకులూరు, అనకాపల్లి క్రాస్‌, రంగోయి క్రాస్‌, రాంనగర్‌, బహడపల్లి, నల్లబొడ్లూరు, గుజ్జులురు, బి జగన్నాథపురం మీదుగా నారయణపురం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర:
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 334వ రోజు ముగిసింది. జననేత నేడు 11.1 కిలోమీటర్లు నడిచారు. సోమవారం ఉదయం జననేత పలాస నియోజకవర్గం రాజాంకాలనీ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ధర్మపురం, గరుఢభద్ర, తర్లగాదురు క్రాస్‌,అక్కుపల్లి, గాదురు, చీపురుపల్లి జంక్షన్‌ మీదుగా డెప్పురు వరకు జననేత పాదయాత్ర కొనసాగించారు. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 3,574.1 కిలోమీటర్లు నడిచారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement