పట్టణంలోని పుణ్యపువీధికి చెందిన పి.నందిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం..
శ్రీకాకుళం సిటీ : పట్టణంలోని పుణ్యపువీధికి చెందిన పి.నందిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసన్నపేటకు చెందిన సూర్య అనే వ్యక్తితో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి విషయమై ఆమె కుటుంబ సభ్యులకు నందిని తెలియజేయగా వారు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని నరసన్నపేటలో ఉంటున్న సూర్యకు తెలిపేందుకు బుధవారం అక్కడకి వెళ్లింది.
వివాహానికి రూ.2 లక్షలు ఉంటే సరిపోతాయన్న సూర్య సమాధానంతో ఆమె అవ్వాక్కయింది. తనను కుటుంబ సభ్యులతో పాటు ప్రేమించిన వ్యక్తి కూడా అర్థం చేసుకోవడం లేదని గ్రహించి, తీవ్ర మనస్థాపానికి గురైన నందిని బయట నుంచి తీసుకొచ్చిన కిరోసిన్‌ను ఇంట్లో తాగింది. అపస్మారక స్థితికి చేరుకున్న నందినిని ఆమె తల్లి 108 సాయంతో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నందిని పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నందిని నుంచి రిమ్స్ అవుట్‌పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేశారు.