దారుణ హత్య | Young man brutal murder in srikakulam | Sakshi
Sakshi News home page

దారుణ హత్య

Nov 21 2017 10:57 AM | Updated on Sep 2 2018 4:52 PM

Young man brutal murder in srikakulam - Sakshi

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు ఏడు కిలోమీటర్ల దూరంలో దారుణ హత్య జరిగింది. నిర్మానుష్యంగా ఉన్న జీడితోటల్లో ఓ యువకుడిని అంత్యం త కిరాతకంగా నరికిపడేశారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు తలను అక్క డ ఉంచకుండా మిగతా దేహాన్ని కాల్చేప్రయత్నం చేశారు. ఈ విషయం పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం దావానంలా వ్యాపిం చడంతో సంచలనమైంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. పలాస మున్సిపాలిటీ పరిధి 3వ వార్డు నీలగారంపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. సుమారు 27 ఏళ్లు ఉన్న యువకుడి తల పూర్తిగా నరికేసి, కాళ్లు, చేతులను నరికేశారు.

 తల కనిపించకుండా చేసి మొండాన్ని జీడి కంపలతో కప్పి కాల్చేప్రయత్నం చేశారు. కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్‌కు ఈ విషయం తెలియడంతో సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడటంతో టార్చ్‌లైట్‌లు, కొంతమంది స్థానికుల సహకారంతో జీడి కంపల మధ్య ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. నీలగారంపాడు రెవెన్యూ అధికారి జన్ని అప్పలస్వామి నుంచి పోలీసులు సమాచారాన్ని సేకరించారు. చీకటి పడటంతో అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే సీఐ కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఇది హత్యగా భావిస్తున్నామన్నారు. హత్య జరిగి మూడు రోజులు అయి ఉంటుందని, మృతదేహాన్ని సగం కాల్చి విడిచిపెట్టడంతో జంతువులు కాళ్లు, చేతులు కొరికేశాయని చెప్పారు.

 మృతుని తల కోసం పరిసర ప్రాంతాల్లో పరిశీలించినా ఫలితం లేకపోయిందన్నారు. ముఖం ఉంటే గుర్తుపడతారనే అనుమానంతో మాయం చేసినట్టు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సంఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని బయటకు తీయించి పూర్తి సమాచారం అందజేస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్‌టీం మంగళవారం వచ్చి పరిశీలించాక పూర్తి సమాచారం వెళ్లడవుతుందన్నారు. ఇదిలావుండగా జీడి కంపల మధ్య ఉన్న మృతదేహాన్ని చూసిన పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement