వాటికి కేంద్రమే నిధులివ్వాలి: యనమల

వాటికి కేంద్రమే నిధులివ్వాలి: యనమల - Sakshi


హైదరాబాద్: ఈ నెల12న 14వ ఆర్థిక సంఘం ఏపీలో పర్యటిస్తుందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సీఎం చంద్రబాబు, తాను ఆర్థిక సంఘం సభ్యులతో భేటీ కానున్నట్టు చెప్పారు. విభజన చట్టంద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు, గ్రాంట్ల కోసం ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు.



రాజధానిలో భవనాలు పీపీపీ పద్ధతిలో చేపడతామన్నారు. భూసేకరణ కంటే భూ సమీకరణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. 13 జిల్లాల అభివృద్ధి ప్రణాళిక దీర్ఘకాలికకార్యాచరణ ఆధారంగా రూపొందిస్తామన్నారు. జాతీయస్థాయి విద్యాసంస్థలు, పారిశ్రామిక కారిడార్‌కు పూర్తిగా కేంద్రమే నిధులు ఇవ్వాల్సి ఉందని విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top