వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకోంది. ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి ముందు బుధవారం ధర్నాకు దిగారు.
నంద్యాల(కర్నూలు): వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకోంది. ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి ముందు బుధవారం ధర్నాకు దిగారు. పోలీసులు, బాధితురాలి బంధువుల కథనం ప్రకారం... కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన భాను వరకట్న వేధింపులతో సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి భాను మృతి చెందింది.
పోస్ట్‌మార్టం అనంతరం బుధవారం ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. వరకట్న వేధింపులకు భాను బలైపోయిందని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం భాను కుటుంబీకులు, బంధువులు సలీమ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. కాగా, సలీమ్‌పై పోలీసులు వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.