అవసరమైతే చట్టాన్నీ చేతుల్లోకి తీసుకుంటాం: అశోక్బాబు | We will violate law if needed, says ashok babu | Sakshi
Sakshi News home page

అవసరమైతే చట్టాన్నీ చేతుల్లోకి తీసుకుంటాం: అశోక్బాబు

Nov 27 2013 1:19 PM | Updated on Mar 23 2019 9:03 PM

అవసరమైతే చట్టాన్నీ చేతుల్లోకి తీసుకుంటాం: అశోక్బాబు - Sakshi

అవసరమైతే చట్టాన్నీ చేతుల్లోకి తీసుకుంటాం: అశోక్బాబు

రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు బుధవారం నెల్లూరులో ఆరోపించారు.

రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు బుధవారం నెల్లూరులో ఆరోపించారు. పార్లమెంట్కు టి.బిల్లు తీసుకువస్తే మెరుపు సమ్మె చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే చట్టాన్ని  చేతుల్లోకి తీసుకుంటామని హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసమే రాష్ట్ర విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుందని అశోక్ బాబు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

 

ఆంధ్రప్రదేశ్ విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఏపీఎన్జీవోలు దాదాపు రెండు నెలలకు పైగా సమ్మె చేశారు. ఫై లిన్ తుఫాన్ నేపథ్యంలో సమ్మె విరమించాలని సీఎం ఏపీఎన్జీవోలను అభ్యర్థించారు. అ క్రమంలో విభజన జరగకుండా ఉండేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని సీఎం ఆ ఏపీఎన్జీవో సంఘానికి భరోసా ఇచ్చారు. కానీ విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలీలో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో మ రో సారి సమ్మె చేయాలని ఏపీఎన్జీవో సంఘాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement