'విభజన జరిగితే ఉప్పు అమ్ముకోవాల్సిన దుస్థితి' | we will have to sell salt if state is bifurcated, says Bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

'విభజన జరిగితే ఉప్పు అమ్ముకోవాల్సిన దుస్థితి'

Oct 16 2013 12:50 PM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.

తిరుపతి : రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ లేని సీమాంధ్రను ఊహించుకోవడమే కష్టం అని ఆయన బుధవారమిక్కడ అన్నారు. సీమాంధ్రకు మొత్తం సముద్ర జలాలు తప్ప సాగునీరు, తాగునీరు దొరకదన్నారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. తుడా సర్కిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కరుణాకర్‌రెడ్డి ఉప్పు అమ్ముతూ నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా భూమన ప్రతిరోజు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement