జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విషజ్వరంతో ముగ్గురు మృతిచెందారు.
విషజ్వరంతో ముగ్గురి మృతి
Aug 28 2013 6:21 AM | Updated on Sep 1 2017 10:12 PM
మరిపెడ, న్యూస్‌లైన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విషజ్వరంతో ముగ్గురు మృతిచెందారు. మండలంలోని ఎల్లంపేటకు చెంది న లింగోజు వెంకటేశ్వర్లు, శంకరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పెద్దకుమార్తె రచన(19) హైదరాబాద్‌లోని నల్ల మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కళాశాల నుంచి తన ఇంటికి చేరింది. కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ఆస్పత్రిలో ఐదు రోజుల క్రితం చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు రచనను హైదరాబాద్‌కు తరలిస్తుండగా సూర్యాపేట సమీపంలో మార్గమధ్యలో చనిపోయింది. చిన్నకూతురు స్వీటీ వరంగల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అక్కాచెల్లెలు ఎప్పుడు చదువులో ముందంజలో ఉండేవారు. రచన మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.
చెల్పూరు శివారులో వ్యక్తి..
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని బొబ్బలోనిపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ల ఓదెలు(55) విషజ్వరంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. వారం రోజుల క్రితం ఓదెలుకు జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న వైద్యులతో చికిత్సచేయించుకున్నా ఫలితం లేకపోవడంతో రెండు రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూనే మృతిచెందాడు. మృతుడికి భార్య సమ్మక్క, కొడుకు, నలుగురు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సమ్మక్క విషజ్వరంతో బాధపడుతోంది.
బండారుపల్లిలో మహిళ ..
ములుగు : మండలంలోని బండారుపల్లికి చెందిన కానుగంటి మమత(32) డెంగీతో మంగళవారం మృతిచెందిం ది. మమత 12 రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మొదట ములుగులో చికిత్స చేయించినా జ్వరం తగ్గకపోవడంతో 10 రోజుల క్రితం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డెంగీ జ్వరంగా వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందిందని వారు వెల్లడించారు. మృతురాలికి భర్త రవి, కుమార్తెలు రమ్య, ధరణి ఉన్నారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
Advertisement