పార్టీ అభివృద్ధిలో యువతే కీలకం | The party development is the youth crucial | Sakshi
Sakshi News home page

పార్టీ అభివృద్ధిలో యువతే కీలకం

Mar 1 2016 3:51 AM | Updated on Aug 10 2018 8:16 PM

పార్టీ అభివృద్ధిలో యువతే కీలకం - Sakshi

పార్టీ అభివృద్ధిలో యువతే కీలకం

తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో యువతే కీలకమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు.

చిత్తూరు(రూరల్): తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో యువతే కీలకమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధరవర్మ అధ్యక్షతన సోమవారం  చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. పార్టీ అభివృద్ధికి యువత ముందుండి పని చేయాలని కోరారు. అలాంటి వారికి పార్టీలో మంచి గుర్తింపుతో పాటు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు దొరబాబు, నాని, సురేంద్రకుమార్, ఇందిరమ్మ, ప్రవీణ్, తెలుగు యువత జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement