సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీ ప్రక్రియ ముగిసింది. తనిఖీ కమిటీ ఇచ్చిన నివేదికలు, వివరాల ప్రకారం పింఛన్లను డీఆర్‌డీఏ అధికారులు కంప్యూటరీక రిస్తున్నారు.
- ఇప్పటి వరకూ 84వేల పింఛన్లు కంప్యూటరీకరణ
- అందులో 2,800 మంది అనర్హులు
- కొనసాగుతున్న కంప్యూటరీకరణ
- 2వ తేదీ పింఛన్ ఇవ్వడం అసాధ్యమే!
సాక్షి, చిత్తూరు: సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీ ప్రక్రియ ముగిసింది. తనిఖీ కమిటీ ఇచ్చిన నివేదికలు, వివరాల ప్రకారం పింఛన్లను డీఆర్‌డీఏ అధికారులు కంప్యూటరీక రిస్తున్నారు. బుధవారం వరకూ 84 వేల పింఛన్లను కంప్యూటరీకరించారు. ఇందులో 2,800 మంది అనర్హులని తేల్చారు. తక్కిన పింఛన్లను కంప్యూటరీకరించేందుకు మరో రెండు, మూడురోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
కంప్యూటరీకరణ పూర్తయ్యే వరకూ ఎంతమంది అనర్హులు ఉన్నారో తెలిసే పరిస్థితి లేదు. బుధవారం సాయంత్రం వరకూ తనిఖీల ప్రక్రియ కొనసాగింది. వీటన్నిటినీ కంప్యూటరీకరించి, అర్హుల జాబితాను సిద్ధం చేసేందుకు సుమారు పదిరోజుల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నా రు. ఈ క్రమంలో ప్రభుత్వం చెబుతున్నట్లుగా రూ.వెరుు్య, రూ.1500 చొప్పున పెంచిన పింఛను సొమ్మును వచ్చేనెల 2 నుంచి పంపిణీ చేయడం అసాధ్యమని తెలుస్తోంది.
ఇంటికి ఓ పింఛను మాత్రమే!
ఇంటికి ఒక పింఛను మాత్రమే ఉండేలా తనిఖీలు నిర్వహిం చారు. ఓ ఇంట్లో ఒకరికి వృద్ధాప్య పింఛను అందుతుంటే వారి ఇంట్లో మరో వితంతువు, వికలాంగుడు ఉన్నప్పటికీ పింఛన్లను తొలగిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ పింఛను తీసుకున్నవారు తనిఖీల్లో తమ పేరు గల్లంతవుతోందని తెలిసి, లబోదిబోమంటున్నారు. టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో పింఛన్ల తనిఖీ జరిగింది.
దీంతో అర్హులై ఉండి వైఎస్సార్ సీ పీ సానుభూతి పరులుగా ముద్రపడిన వారి పింఛన్లకు కూ డా కత్తెర పెడుతున్నారు. దీంతో వారు కూడా తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాలను లిఖిత పూ ర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. 84వేల పింఛన్లలోనే 2,800 అనర్హుల పేర్లు ఉంటే, జిల్లాలోని 4,01,442 మందిలో ఎం త మంది అనర్హులు ఉంటారో, అందులో తమ పేరు ఉం టుందో, లేదోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
అర్హులకు న్యాయం చేసేలా తనిఖీ
ఇంటికి ఓ పింఛను మాత్రమే ఇవ్వాలని నిబంధన విధిం చినా, సడలింపులను అవలంభిస్తున్నాం. ఇంట్లో వృ ద్ధాప్య పింఛను తీసుకుంటున్న వ్యక్తి ఒకరు ఉన్నప్పటికీ, మరో వికలాంగుడు ఉంటే వారికి పింఛన్ ఇచ్చేలా చూస్తున్నాం. ఇప్పటి వరకూ 2,800 మంది అనర్హులు తేలారు. కంప్యూటరీకరణ పూర్తయితే అనర్హుల జాబితా తేలు తుంది.
-రవిప్రకాశ్‌రెడ్డి, పీడీ, డీఆర్‌డీఏ