గాంధీ భవన్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది.
గాంధీ భవన్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. 65 గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం గాంధీ భవన్కు వచ్చిన సిఎం కిరణ్ను సొంత పార్టీకి చెందిన తెలంగాణ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అందులోభాగంగా సీఎం కిరణ్ గోబ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతొ కొద్ది పాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమంటూ మొదటి నుంచి సీఎం కిరణ్ చెబుతునే ఉన్నారు. ఆ క్రమంలో అసెంబ్లీలో చర్చకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు అసమగ్రంగా ఉందని తిప్పి కేంద్రానికి పంపాలని స్పీకర్కు శనివారం సభానాయకుడిగా కిరణ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు, ప్రజలు సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.