మండలంలోని బైరి కూడలి వద్ద ఉన్న ఓ ప్రయివేటు పాఠశాల టీచర్ బలగ నవీన్ అనే ఐదో తరగతి విద్యార్థిని విచక్షణా
శ్రీకాకుళం రూరల్: మండలంలోని బైరి కూడలి వద్ద ఉన్న ఓ ప్రయివేటు పాఠశాల టీచర్ బలగ నవీన్ అనే ఐదో తరగతి విద్యార్థిని విచక్షణా రహితంగా కర్రతో కొట్టి గాయపరిచినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాల్సింది పోయి ఇలా విచక్షణా రహితంగా కొట్టడం సమంజసం కాదని వాపోయారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ పాతిన శాంతమ్మ, గ్రామ పెద్దలు పాఠశాల ప్రిన్సిపాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.