
పీసీపల్లి: పేదోళ్ల గురించి ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని వలేటివారిపాలెంలోని బీసీ కాలనీకి చెందిన మహిళలు పెదచర్ల కోటేశ్వరమ్మ, మునిరత్నం, సింహాద్రి తదితరులు వాపోయారు. తమ సమస్యలు జగన్‌కు విన్నవించడానికి వారు ప్రజాసంకల్పయాత్రకు వచ్చారు. తమ కాలనీకి రోడ్లు లేవని, తాగునీరు, మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు.