రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబును బదిలీ చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబును బదిలీ చేశారు. ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్గా సోమేష్ కుమార్ను నియమించారు. మున్సిపల్ శాఖ కొత్త కార్యదర్శిగా సమీర్ శర్మను నియమించారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఎస్కె నవీన్ను నియమించారు.
రెవెన్యూ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా బి.వెంకటేశ్వర్లును, విపత్తు నివారణ కమిషనర్గా పార్థసారథిని, బీసీ వెల్ఫేర్ కార్యదర్శిగా రాధను, సర్వీసెస్ ముఖ్య కార్యదర్శిగా ఎస్కె సిన్హాను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.