సీమాంధ్ర ఆందోళన కారులు సమైక్య నినాదాలతో తమ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు.
చిత్తూరు:సీమాంధ్ర ఆందోళన కారులు సమైక్య నినాదాలతో తమ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ రోడ్లపైనే నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు హైవేపై నిరసన గళం వినిపిస్తూ కదం తొక్కారు. దీంతో నాలుగు కి.మీ మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
సీమాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. సరైన ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే విద్యాసంస్థలకు యాజమాన్యం సెలవులు ప్రకటించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేశారు.