ఆథ్యాత్మిక నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు.
- తిరుపతిలో పట్టపగలే దోపిడీ
తిరుపతి: ఆథ్యాత్మిక నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. బుధవారం ఉదయం కేపీ రోడ్డు సమీపంలోని శాంతినగర్ లో ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ ఒంటరి మహిళను కత్తితో బెదిరించి బంగారం దోచుకెళ్లడం సంచలనం రేపింది.
శాంతినగర్ లోని ఓ ఇంట్లో జ్ఞానాంబ (63) అనే మహిళ ఒంటిరిగా నివసిస్తోంది. దీనిని అవకాశంగా తీసుకున్న ఓ యువకుడు బుధవారం ఉదయం జ్ఞానాంబ ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కత్తితో బెదిరించి బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదుతోపాటు మొబైల్ ఫోన్ ను లాక్కెళ్లాడు. దొంగ వెళ్లిపోయిన తర్వాత తేరుకున్న ఆమె.. పక్కింటి వాళ్ల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.