నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయక(వీఆర్‌ఏ) పోస్టుల నియామకానికి మార్గం సుగమమైంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయక(వీఆర్‌ఏ) పోస్టుల నియామకానికి మార్గం సుగమమైంది. అతి త్వరలోనే ఈ నియామకాల ప్రక్రియ కార్యరూపం దాల్చనుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి శనివారం ఈ నియామకాల వివరాలను ప్రకటించారు. దీంతో జిల్లాలో 230 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందులో వీఆర్‌ఓ పోస్టులు 72 ఉండగా, వీఆర్‌ఏ పోస్టులు 158 ఉన్నాయి.
ఏడాదిన్నర క్రితం వీఆర్‌ఓ, ్ఠవీఆర్‌ఏ పోస్టుల నియామకాలు చేపట్టినప్పటికీ.. పూర్తిస్తాయి పోస్టులు కాకుండా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న స్థానాలకే షెడ్యూల్ ప్రకటించి ప్రక్రియ పూర్తి చేశారు. తాజాగా తదుపరి ప్రాధాన్యత ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా నియామకాల షెడ్యూల్‌ను ఈనెల 28న కలెక్టర్ విడుదల చేయనున్నారు. జనవరి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి ఫిబ్రవరి 2న పరీక్ష నిర్వహిస్తారు. అదే నెల 20 ఫలితాలు విడుదల చేయనున్నారు.