నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి పథకాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తన చేతులమీదుగా ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు.
శ్రీకాళహస్తి: నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి పథకాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తన చేతులమీదుగా ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ఈ పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల క్యాన్ వాటర్‌ను ప్రజలకు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో మొదట శ్రీకాళహస్తిలో ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి చెప్పారు.