
నేనిప్పుడు ఏ పార్టీకీ చెందను
‘నేనిప్పుడు ఏ పార్టీకీ చెందను. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తిని.
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన మరుసటి రోజే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, మాధవసేవకు నిలయమైన స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మేకింగ్ ఆఫ్ డెవలప్‌డ్ ఇండియా ఆలోచనతో ముందుకు సాగాలనీ, ‘సబ్ కామ్ సర్కార్ కరేగా’ అన్న భావనను వదిలి, ‘వియ్ ఆర్ మిషన్...నాట్ ఫర్ కమీషన్’ అంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వెంకయ్యనాయుడిని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్, కలెక్టర్ ప్రద్యుమ్న తదితరులు సత్కరించారు. పలువురు విద్యార్థినులు వెంకయ్యకు రాఖీ కట్టారు.