ముద్రగడ యాత్ర నేపథ్యంలో 'తూర్పు'లో ఆంక్షలు | mudragada padmanabham yatra:section 144 promulgated in east godavari district | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరిలో కొనసాగుతున్న ఆంక్షలు

Nov 15 2016 1:04 PM | Updated on Aug 31 2018 8:31 PM

ముద్రగడ యాత్ర నేపథ్యంలో 'తూర్పు'లో ఆంక్షలు - Sakshi

ముద్రగడ యాత్ర నేపథ్యంలో 'తూర్పు'లో ఆంక్షలు

ముద్రగడ సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో జల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

రాజమండ్రి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 144, 30 సెక్షన్లు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు.
 
గతంలో జరిగిన ఘటనలతో పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఆయన చెప్పారు. కాగా బుధవారం నుంచి ముద్రగడ సత్యాగ్రహ యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ అయిదురోజుల పాటు ఆయన యాత్ర చేయనున్నారు. అయితే యాత్రకు అనుమతి లేదంటున్న పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ స్వస్థలం కిర్లంపూడిలో భారీగా పోలీసులు మోహరించారు.
 
ఇక ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. పాదయాత్రకు భద్రత, అనుమతిపై నిర్ణయం వెల్లడించాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మధ్యాహ్ననికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement