నాకే ముడుపులిస్తామన్నారు
విశాఖలో జరుగుతున్న భూపోరాటాన్ని విరమించుకుంటే తనకే ముడుపులిస్తామని భూ బకాసురులు
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న భూపోరాటాన్ని విరమించుకుంటే తనకే ముడుపులిస్తామని భూ బకాసురులు దూతల ద్వారా రాయబారం పంపారని, వెంకట రామరాజు అనే వ్యక్తి స్వయంగా మొబైల్‌లో తనకు సంక్షిప్త సందేశం పంపించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక అసైన్డ్ భూములను అఖిలపక్ష నేతలతో కలసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమను ఎంత ప్రలోభపెట్టినా, భయపెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపేదిలేదని స్పష్టంచేశారు.