జాయింట్ కలెక్టర్లకు భూసేకరణ బాధ్యత | land pooling responsibility handed to joint collectors | Sakshi
Sakshi News home page

జాయింట్ కలెక్టర్లకు భూసేకరణ బాధ్యత

Oct 31 2014 12:24 PM | Updated on Sep 2 2017 3:39 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణ కోసం ఆరుగురు జాయింట్ కలెక్టర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణ కోసం ఆరుగురు జాయింట్ కలెక్టర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో జాయింట్ కలెక్టర్కు 5 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా నిర్దేశించనుంది. రెండు రోజుల్లో భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. రైతులిచ్చే భూములు, కలెక్టర్లకు మధ్య ఎంఓయూ చేయాలని నిర్ణయించింది. ఎంఓయూ కుదిరిన తర్వాత రైతులకు ఏడాదికి రూ. 25వేల చొప్పున పరిహారం చెల్లించాలని చూస్తోంది.

భూసేకరణ పూర్తైన తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యత అంతర్జాతీయ సంస్థకు అప్పగించాలని భావిస్తోంది. ఇందుకోసం రూ. 20 నుంచి రూ. 30 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది. మాస్టర్ ప్లాన్ తయారయ్యాక రైతులకు 1000 గజాల స్థలం ఇవ్వాలని భావిస్తోంది. భూసమీకరణ పూర్తైయ్యాకే నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement