తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర మంత్రుల తీరు భరించలేకుండా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం అభిప్రాయపడింది.
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర మంత్రుల తీరు భరించలేకుండా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం అభిప్రాయపడింది. మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశంలో ఏడుగురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సీఎం పద్ధతి మార్చుకోకుంటే కేబినెట్‌లో ఉండలేమని తెలంగాణ మంత్రులు తెగేసిచెప్పాలని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. హైకమాండ్‌పై ఒత్తిడి పెంచెందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ తెస్తున్నది, ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించారు.