చంద్రబాబు లేఖకు స్పందించని కేసీఆర్ | KCR is not respond to Chandrababu Naidu letter | Sakshi
Sakshi News home page

చంద్రబాబు లేఖకు స్పందించని కేసీఆర్

Jul 15 2014 6:35 PM | Updated on Aug 15 2018 9:20 PM

చంద్రబాబు లేఖకు స్పందించని కేసీఆర్ - Sakshi

చంద్రబాబు లేఖకు స్పందించని కేసీఆర్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు.

హైదరాబాద్:  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. కెసిఆర్  వల్ల 9లక్షల 50 వేల మంది విద్యార్ధుల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసినా కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదని చెప్పారు. కేసీఆర్‌ నియంత అనుకుంటున్నారా? నోడల్ వ్యవస్థకు రాజు అనుకుంటున్నారా? అని  కిషోర్‌బాబు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement