భార్యపై భర్త దాడి | Husband attacked on Wife in drink | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త దాడి

Feb 2 2015 11:24 AM | Updated on Sep 2 2017 8:41 PM

ఎన్‌ఎస్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న రాపూరు మీనాపై ఆమె భర్త సుబ్రహ్మణ్యం ఆదివారం దాడి చేసి గాయపర్చాడు.

నాయుడుపేట టౌన్ : పట్టణంలోని ఎన్‌ఎస్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న రాపూరు మీనాపై ఆమె భర్త సుబ్రహ్మణ్యం ఆదివారం దాడి చేసి గాయపర్చాడు. పోలీసుల కథనం మేరకు.. సుబ్రహ్మణ్యం తరచూ మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మద్యం సేవించి వచ్చి ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వాలంటూ వివాదానికి దిగాడు. ఆమెను కొట్టి గాయపరిచాడు. స్థానికులు ఆయనను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన మీనాను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

పోల్

Advertisement