breaking news
husaband attack
-
ప్రాణం తీసిన అనుమానం
సాక్షి, కాకినాడ: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్యచేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వలస అలివేలు(28) అనే వివాహితను ఆమె భర్త వెంకటరమణ గత కొద్ది రోజులుగా అనుమానిస్తున్నాడు. ఇదే విషయమై శనివారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం తలపై రాయితో కొట్టి అలివేలును చంపేశాడు. కాగా... ఆదివారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి రాగా సమాచారమందుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
భార్యపై భర్త దాడి
నాయుడుపేట టౌన్ : పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న రాపూరు మీనాపై ఆమె భర్త సుబ్రహ్మణ్యం ఆదివారం దాడి చేసి గాయపర్చాడు. పోలీసుల కథనం మేరకు.. సుబ్రహ్మణ్యం తరచూ మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మద్యం సేవించి వచ్చి ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వాలంటూ వివాదానికి దిగాడు. ఆమెను కొట్టి గాయపరిచాడు. స్థానికులు ఆయనను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన మీనాను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.