కొలువుల జాతర | government notification releasing too many jobs | Sakshi
Sakshi News home page

కొలువుల జాతర

Jan 29 2014 3:07 AM | Updated on Oct 17 2018 4:29 PM

జిల్లాలో ప్రభుత్వ కొలువుల జాతర ఆరంభమైంది. నిరుద్యోగులకు నూతన సంవత్సరం బాగా కలిసి వస్తోంది.

మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :  జిల్లాలో ప్రభుత్వ కొలువుల జాతర ఆరంభమైంది. నిరుద్యోగులకు నూతన సంవత్సరం బాగా కలిసి వస్తోంది. కొంత కాలంగా ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగావ కాశాలు సన్నగిల్లాయి.

ఇటీవల ప్రభుత్వం దశలవారీగా ఒక్కో శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వీఆర్‌వో, వీఏవో, పంచాయితీ కార్యద ర్శి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.  నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుని పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా అటవీ శాఖలో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

 మూడేళ్ల వ్యవధిలో 3,820 పోస్టులను, రెండేళ్లలో దశలవారీగా 2,547 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఫిబ్రవరి రెండవ వారంలో నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నియామకం ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఆ దిశ వైపు అధికారుల కసరత్తు ఆరంభించడంతో నిరుద్యోగులు కూడా ఉద్యోగాలను సాధించాలనే తపనతో ఉన్నారు. జిల్లాలోని ఆరు అటవీశాఖ డివిజన్‌లు ఉండగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 30, బీట్ ఆఫీసర్‌లు 113, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌లు 215 పోస్టులు మొత్తం 358 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆ పోస్టులకు ప్రభుత్వం విద్యార్హతలను కూడా ప్రకటించింది. అటవీ సెక్షన్ అధికారి పోస్టుకు  ఇంజినీరింగ్‌లో సైన్స్ ఆధారంగా పట్ట భద్రులై ఉండాలి. అలాగే బీట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు పదో తరగతి విద్యార్హతగా నిర్ధేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement