రాజమండ్రి ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం | Fire accident in Exhibition at rajahmundry morampudi centre | Sakshi
Sakshi News home page

రాజమండ్రి ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం

Feb 25 2015 8:15 AM | Updated on Sep 5 2018 9:45 PM

రాజమండ్రి ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం - Sakshi

రాజమండ్రి ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మోరంపూడి సెంటర్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది.

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మోరంపూడి సెంటర్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది.  వేకువజామున 3 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాజ్‌మహల్ సెట్టింగ్ పూర్తిగా దగ్ధం అయింది.

 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.50 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆగంతకులు ఎవరైనా నిప్పు పెట్టి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 40 రోజులుగా ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది.  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement