ఎట్టకేలకు కరువు నివేదిక | Finally drought report | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కరువు నివేదిక

Oct 23 2013 3:08 AM | Updated on Sep 1 2017 11:52 PM

ఎట్టకేలకు కరువు నివేదిక సిద్ధమవుతోంది. నెలాఖరులోగా ప్రభుత్వానికి పంపించేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

 విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు కరువు నివేదిక సిద్ధమవుతోంది. నెలాఖరులోగా ప్రభుత్వానికి పంపించేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏయే మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందన్న విషయంపై ఇప్పటికే వివరాలు సేకరించారు. వాటితో పాటు జిల్లాలో ఖరీఫ్ పంట పరిస్థితులపై నివేదికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో కరువు మండలాలను ఎట్టకేలకు కరువు నివేదికమగుర్తించి నెలాఖరులోగా నివేదికను పంపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో పంట నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల నుంచి వచ్చిన రిపోర్టులను కేంద్రానికి సత్వరం సమర్పించాల్సి ఉందన్నారు. అనంతరం కరువు ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర కమిటీ వస్తుందని తెలిపారు.
 
 
 ఆ కమిటీ పరిశీలించి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు కరువు నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిపోయిన సగానికి పైగా మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు. సుమారు లక్ష హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయని సాగుపనులకు రైతులు సిద్ధమయ్యారు. జిల్లాలో 50 శాతానికిపైగా వ్యవసాయం వర్షాధారంగానే చేపడతారు. అయితే ఆశించిన విధంగా వర్షాలు అనుకూలించలేదు. దాదాపుగా 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు, పెదబయలు, గూడెంకొత్తవీధి మండలాల్లో మాత్రం అత్యధిక వర్షం కురిసింది. దీంతో మొత్తంగా 56 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు.
 
 30 మండలాల్లో కరువు
 జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో దాదాపుగా 30 మండలాల్లో కరువు నెలకొంది. ఆగస్టు 30 వరకు ఉన్న వర్షపాతాన్ని మండలాల వారీగా పరిశీలించి తదనుగుణంగా కరువు అంచనాలను సిద్ధం చేయాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోడానికి ఆస్కారం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకు  అంతా సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు.
 
 దీంతో వర్షపాతం వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికి కూడా కరువు నివేదిక సిద్ధం కాలేదు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్య ఆర్డీవోల నుంచి వర్షపాతం వివరాలను సేకరించాలని భావించారు.
 అయితే అవి కచ్చితంగా ఉంటాయా? లేదా? అన్న విషయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరువు నివేదికను తయారు చేయలేదు. మంగళవారం నాటి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జేసీ ప్రవీణ్‌కుమార్, డీఆర్వో వెంకటేశ్వరరావు, నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేతతయాతియో  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement