పట్టిసీమ పైలాన్ పనులకు బ్రేక్ | farmers pur a break to pattiseema pylon works | Sakshi
Sakshi News home page

పట్టిసీమ పైలాన్ పనులకు బ్రేక్

Mar 24 2015 7:12 PM | Updated on Oct 1 2018 2:28 PM

పట్టిసీమ పైలాన్ పనులకు బ్రేక్ పడింది. అధికారులు మొదలుపెట్టిన ఈ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు.

పట్టిసీమ పైలాన్ పనులకు బ్రేక్ పడింది. అధికారులు మొదలుపెట్టిన ఈ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతులనుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోకుండానే హడావుడిగా అధికారులు పైలాన్ పనులను ప్రారంభించారు. పట్టిసీమ సమీపంలోని బంగారన్న పేటలో మరో రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన నిర్వహించడానికి అధికారులు సిద్ధపడ్డారు. దాంతో రైతులు వాటిని అడ్డుకున్నారు.

 

పప్పల సత్యానారాయణ, పప్పల రామచంద్ర తదితరులు వైఎస్ఆర్సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడును కలిసి ఇక్కడి విషయాలను వివరించారు. అనంతరం యంత్ర సామగ్రిని తరలించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చామని, ఇక మళ్లీ పట్టిసీమకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement