
రేపు స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు
కర్నూల్, కడప, నెల్లూర్ జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.
భన్వర్‌లాల్ మాట్లాడుతూ... ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పకడ్భందీగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులను సీఈఓ ఆదేశించారు. 1950 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి ఫిర్యాదులున్నా కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సీఈఓ భన్వర్‌లాల్ కోరారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారిని భయపెట్టినా, ఒత్తిడి చేసినా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఈఓ సూచించారు.
డబ్బు పంపిణీ వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల పరిశీలనకు ఈసీ మెక్రో అబ్జర్వ్‌లను నియమించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు చెందని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించింది.