తాగునీటి కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా | dharna at ananthpur collectorate | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా

Aug 17 2015 12:10 PM | Updated on Jun 1 2018 8:54 PM

అనంతపురం జిల్లాలో తాగునీటి కోసం స్థానికులు ధర్నాకు దిగారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో తాగునీటి కోసం స్థానికులు ధర్నాకు దిగారు. జిల్లాలోని వజ్రకరూర్ మండలం జెరుట్ల రామాపురం గ్రామంలో తాగునీటి కోసం స్థానిక సర్పంచ్ ప్రభుత్వ భూమిలో బోర్లు వేశారు. అయితే బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పాల్గొని నిరసన కారులకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరవకొండలో టీడీపీ నేత పయ్యావుల దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయన్నారు. మానవతా దృక్పథం లేకుండా తాగునీటి బోరును పయ్యావుల సోదరులు ధ్వంసం చేయించారని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు, వజ్రకుమార్ ఎమ్మార్వో, ఆర్డబ్య్లూఎస్ డీఈ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement